Updated : 10/09/2020 22:11 IST

రుణగ్రస్తుల ఊరటపై అంచనాకు కమిటీ

దిల్లీ: బ్యాంకు రుణగ్రస్తుల ఊరటను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమంచింది. వడ్డీ రద్దు, వడ్డీ మీద వడ్డీ రద్దు తదితర అంశాలలలో ఊరట కోరుతూ గజేంద్ర శర్మ వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం, తదితరుల మధ్య ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ నేపథ్యంలో అనేక అంశాలు ప్రస్తావనకు రావడంతో అంచనా కోసం కమిటీని కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోగలిగేలా పరిస్థితిని సంపూర్ణంగా అంచనా వేయడానికి ఈ నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. 

ఈ కమిటీ ఛైర్మన్‌గా మాజీ కంప్ట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా రాజీవ్‌ మహర్షి.. సభ్యులుగా ఆర్బీఐ మానిటరీ పాలసీ మాజీ సభ్యుడు డాక్టర్‌ రవీంద్ర హెచ్‌. దోలాకియా, ఎస్బీఐ మాజీ ఎండీ శ్రీరామ్‌ను  కేంద్రం నియమించింది. కొవిడ్‌-19 సంబంధ మారటోరియంలో వడ్డీ మాఫీ, వడ్డీ మీద వడ్డీతో దేశ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థిరత్వంపై ప్రభావాన్ని అంచనా వేయడం, ఈ విషయంలో సమాజంలోని వివిధ వర్గాల ఆర్థిక ఇబ్బందులు తొలగించడానికి సూచనలు, ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీ వారంలోపు తమ నివేదికను కేంద్రానికి అందజేయాల్సి ఉంది. అవసరాన్ని బట్టి ఈ కమిటీ.. బ్యాంకులు, ఇతర భాగస్వాములను సంప్రదించేందుకు ఆర్థికశాఖ అవకాశం కల్పించింది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని