అదనపు రుణాలకు ఏపీ, తెలంగాణకు అనుమతి

అదనపు రుణాలు తీసుకునేందుకు పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు..

Published : 20 Dec 2020 16:03 IST

దిల్లీ: అదనపు రుణాలు తీసుకునేందుకు పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు రూ.16,728 కోట్ల అదనపు రుణాలు తీసుకునేందుకు అనుమతించింది. సులభతర వాణిజ్యం, ఒకే దేశం-ఒకే రేషన్‌, పట్టణ స్థానిక సంస్థలు, విద్యుత్‌ రంగాల్లో సంస్కరణలు అమలు చేసినందుకు ఈ అవకాశం కల్పించింది. ఏపీకి రూ.2,525కోట్లు, తెలంగాణకు రూ.2,508 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని