వారి త్యాగాలు వెలకట్టలేనివి: చంద్రబాబు

కరోనా వ్యాప్తి నియంత్రణలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ త్యాగాలు, సేవలు వెలకట్టలేనివని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు.

Published : 25 Jul 2020 16:01 IST

అమరావతి: కరోనా వ్యాప్తి నియంత్రణలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ త్యాగాలు, సేవలు వెలకట్టలేనివని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. కరోనా మహమ్మారిపై అందరికీ అవగాహన అవసరమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ వైద్యులతో చంద్రబాబు వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. అధ్యయనాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి పంపుతున్నానని చెప్పారు. కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ను కాపాడుకోవాలన్నారు.
‘‘ గత 2 వారాల్లో ఏపీలో కరోనా వృద్ధి రేటు అత్యధికంగా ఉంది. మరణాల్లోనూ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ప్రజలను అప్రమత్తం చేయడం తప్ప ప్రస్తుతానికి మందులు లేవు. డిజిటల్‌ సోషలైజేషన్‌, భౌతిక దూరం రెండూ ముఖ్యమే. ఎక్కువ మందిని ఒకే అంబులెన్స్‌లో తీసుకొస్తున్నారు. దీనివల్ల పాజిటివ్‌ లేనివారికి కూడా వచ్చే అవకాశముంది. అంబులెన్స్‌లు, ఆస్పత్రుల్లోనూ శానిటైజేషన్‌ ఎంతో ముఖ్యం’’ అని చంద్రబాబు అన్నారు.

క్వారంటైన్‌ కేంద్రాల్లో తగిన వసతులు ఉంటే రోగులు భయపడకుండా ఉంటారని చంద్రబాబు అన్నారు. కరోనా మృతులకు తగిన రీతిలో అంతిమ సంస్కారాలు జరగకపోవడం బాధాకరమని తెలిపారు. ప్రజలకు వేరే అత్యవసరమేది ఉన్నా.. కరోనా పరీక్ష చేయకుండా వైద్యం అందించట్లేదని చంద్రబాబు పేర్కొన్నారు. కరోనా పరీక్షల ఫలితాల కోసం రోగులు వేచి చూడాల్సి రావడం తగదన్నారు. సమాజాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని