అర్చకుడు లేకుండానే ఆ పూజ నిర్వహిస్తారట!

బిహార్‌, ఝార్ఖండ్‌ సహా పలు రాష్ట్రాల్లో ఆ పూజను నిర్వహిస్తారు. అందులో భాగంగా సూర్య భగవానుడిని ప్రత్యేకంగా కొలుస్తారు. అసలు విషయం ఏమిటంటే ఈ పూజను అర్చకుడు లేకుండానే నిర్వహిస్తారట.

Published : 20 Nov 2020 23:12 IST


ఇంటర్నెట్‌ డెస్క్‌ : బిహార్‌, ఝార్ఖండ్‌ సహా పలు రాష్ట్రాల్లో విశేషమైన ఓ పూజను నిర్వహిస్తారు. అందులో భాగంగా సూర్య భగవానుడిని ప్రత్యేకంగా కొలుస్తారు. అసలు విషయం ఏమిటంటే ఈ పూజను అర్చకుడు లేకుండానే నిర్వహిస్తారట. 36 గంటల పాటు మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం చేస్తారట. మరి ఈ అరుదైన పూజ సంగతులేంటో మనమూ తెలుసుకుందామా !
ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించే ఈ పూజను ఛఠ్‌ అంటారు. సూర్యభగవానుడిని కొలిచే ఏకైక పూజ ఇదేనని అక్కడి వారి విశ్వాసం. దీనికే సూర్యశస్తిల్, దళాఛఠ్‌ అని కూడా పేర్లున్నాయాయి. ఏటా కార్తిక మాసం శుక్లపక్షంలోని షష్ఠి సందర్భంగా నాలుగు రోజుల పాటు ఈ ఛఠ్‌ పూజను నిర్వహిస్తారు. దీపావళి మాదిరిగానే ఈ పూజ సమయంలో దీపాలు వెలిగిస్తారు. నదీ ఘాట్‌ల వద్ద పండ్లతో అలంకరించి ఛఠ్‌మాతకు పూజలు చేస్తారు. అనంతరం పండ్లను పంచిపెడతారు. ఈ ఏడాది నవంబర్‌ 18న ప్రారంభమైన ఈ పూజ 21తో ముగియనుంది. ఆ రోజు ఉదయం సూర్యుడికి పూజలు చేసి వేడుకను ముగిస్తారు. పూజారి పాల్గొనని అత్యంత అరుదైన హిందూ పండుగగా ఛఠ్‌ పూజ ప్రాచుర్యం పొందింది. ఈ పూజలోని ప్రసాదాల్లో చెరకు ప్రధానంగా కనిపిస్తుంది. మహా పర్వ సందర్భంగా చెరకు గడలతో ఇల్లు మాదిరిగా నిర్మించి అందులో ఏనుగు ప్రతిమను ఉంచి పూజలు చేస్తారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని