Updated : 25 Dec 2020 11:08 IST

రాష్ట్రంలో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

అర్ధరాత్రి నుంచే మొదలైన సంబరాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాష్ట్రంలో క్రిస్మస్‌ వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. చర్చిలన్నీ రంగురంగుల విద్యుత్తు దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. అర్ధరాత్రి నుంచే క్రీస్తు ఆలయాల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దేవదూతగా శాంతాక్లాజ్‌ బహుమతులు ఇచ్చి ఆశీర్వచనాలు అందజేస్తున్నారు. పర్వదినం సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌ను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. క్రీస్తు జననాన్ని తెలియజేసేలా చర్చిల్లో బొమ్మలు ఏర్పాటు చేశారు. గుణదల మేరీమాత ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, క్రీస్తు గీతాలను ఆలపించారు. కృష్ణా జిల్లా నందిగామలో ప్రార్థనల కోసం మందిరం ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కోటగిరి లంకలో ఆర్సీఎం చర్చిలో ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్‌ స్టార్‌ ఆకర్షణగా నిలిచింది. అన్ని వర్గాల ప్రజలు ఏసుక్రీస్తును ప్రార్థించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. నెల్లూరు జిల్లా సుబేదారిపేటలో నిర్వహించిన ప్రార్థనల్లో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల మందిరాలకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రకాశం జిల్లాలో క్రిస్మస్‌ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. కలెక్టర్‌ పోలా భాస్కర్‌ కేకు కోసి భక్తులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. చీరాల, వేటపాలెం, పరుచూరు ప్రాంతాల్లో క్రిస్మస్‌ సందడి నెలకొంది.

ఇవీ చదవండి...

విభిన్నం.. ఈ క్రిస్మస్‌ చెట్టు

జంతువులకూ.. క్రిస్మస్‌ విందు


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని