
వైరల్: కళ్లముందే విరిగిపడిన కొండచరియ
ఇంటర్నెట్ డెస్క్: భారీ వర్షాలు లేదా భూకంపాలు సంభవించినప్పుడు కొండచరియలు విరిగి పడడం మనం చూస్తుంటాం. అలాంటిదేమీ లేకుండానే ఓ భారీ కొండచరియ విరిగి పడింది. సముద్ర తీరంలో సంభవించిన ఈ ఘటనతో కలకలం రేగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇటీవల స్పెయిన్‌లోని కానరీ ద్వీపంలోని లా గొమేరియా బీచ్‌లో సంభవించింది.
ఇక్కడి సముద్రం ఒడ్డున ఉన్న ఎత్తైన కొండ నుంచి కొంత మేరకు విడివడి నీటిలో పడిపోయింది. ఈ అనూహ్య ఘటనను ఓ ప్రత్యక్ష సాక్షి తన కెమెరాలో బంధించాడు. తొలుత కొద్దిగా మట్టి, రాళ్లు పడటం ఈ వీడియోలో చూడొచ్చు. అక్కడికి కొద్ది క్షణాల్లోనే పెద్ద భాగం సముద్రంలోకి కుప్పకూలిపోయింది. అనంతరం ఆ ప్రదేశంలో భద్రతా సిబ్బంది, జాగిలాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించారు. ఇలాంటి ఘటన పునరావృతం కావచ్చని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. కానరీ ద్వీపాల అధ్యక్షుడు షేర్ చేసిన ఈ వీడియో కొన్ని లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఆ దృశ్యాన్ని మీరూ చూసేయండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Related-stories News
Corona: ‘దక్షిణ’ బెలూన్లే కరోనాను మోసుకొచ్చాయి
-
Related-stories News
Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
-
Ap-top-news News
Andhra News: ఎన్నికైనప్పటి నుంచి సచివాలయంలో కూర్చోనివ్వలేదు.. సర్పంచి నిరసన
-
Ap-top-news News
Andhra News: వినూత్నంగా గుర్రంతో సాగు పనులు..
-
Ap-top-news News
Pinakini Express: పినాకినీ ఎక్స్‌ప్రెస్‌కు ‘పుట్టినరోజు’ వేడుకలు
-
Ap-top-news News
Andhra News: నా చొక్కా, ప్యాంట్ తీసేయించి మోకాళ్లపై కూర్చోమన్నారు.. సాంబశివరావు ఆవేదన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య
- IND vs ENG: ఆదుకున్న పంత్, జడేజా.. తొలిరోజు ముగిసిన ఆట
- Presidential Election: రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మూ గెలుపు ఖాయమే..! మమతా బెనర్జీ
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు