వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై సీఎం కసరత్తు 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది...

Published : 15 Nov 2020 03:49 IST

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ధరణి ద్వారా వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ జరుగుతుండగా వ్యవసాయేతర ఆస్తుల ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి సీఎం ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఎప్పటి నుంచి ప్రారంభించాలి? తదితర అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని