దెందులూరులో పర్యటించిన కేంద్ర బృందం

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు అస్వస్థతకు గురవుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చిన శాస్త్రవేత్తల బృందం దెందులూరులో పర్యటించింది. ..

Published : 11 Dec 2020 17:50 IST

దెందులూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు అస్వస్థతకు గురవుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చిన శాస్త్రవేత్తల బృందం దెందులూరులో పర్యటించింది. డా.సందీప్‌, డా.సాకేత్‌, డా.అవినాశ్‌తో కూడిన బృందం.. దెందులూరులోని ఓ దుకాణంలో ఉన్న క్రిమి సంహారక మందులను పరిశీలించింది. ఖరీఫ్‌లో పంటల సాగుకు రైతులు ఎలాంటి పురుగుమందులు వాడారని దుకాణ నిర్వాహకుడిని అడిగి వివరాలు నమోదు చేసుకుంది. అంతకుముందు ఏలూరు నగరానికి నీరందించే చెరువును శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. పొలాల్లో రైతులను కలిసి ఎటువంటి పురుగుమందులు వాడుతున్నారని ఆరా తీసింది. 

ఇదీ చదవండి..

వింత వ్యాధి తగ్గుముఖం పట్టింది: ఆళ్ల నాని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని