స్టార్‌ డయాగ్నోస్టిక్స్‌ సీజ్‌కు కలెక్టర్‌ ఆదేశాలు

అనంతపురంలోని ప్రైవేటు ల్యాబుల్లో అధిక రుసుములపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుసుములు భారీగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో ఐదు ప్రైవేటు ల్యాబులపై డీఎంహెచ్‌వో బృందం దాడులు నిర్వహించారు.

Published : 05 Sep 2020 23:54 IST

అనంతపురం: అనంతపురంలోని ప్రైవేటు ల్యాబ్‌ల్లో అధిక రుసుములపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుసుములు భారీగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో ఐదు ప్రైవేటు ల్యాబ్‌లపై డీఎంహెచ్‌వో బృందం దాడులు నిర్వహించింది. అందులో స్టార్‌ డయాగ్నోస్టిక్స్‌ కేంద్రాన్ని సీజ్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. అక్రమాలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు పాటించకుండా, అవసరం లేకున్నా సీటీస్కాన్‌, ఇతర పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఐదు డయాగ్నోస్టిక్స్‌ కేంద్రాలపై తనిఖీలు చేసినట్లు తెలిపారు. కొన్ని అవకతవకలు జరిగినట్లు తెలియడం వల్ల రెండు కేంద్రాలను మూసివేయడంతో పాటు మిగతా వాటికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో వీలైతే మానవతా దృక్పథంతో తక్కువ రుసుము తీసుకొని పరీక్ష చేయాలని సూచించారు. అవసరం లేని పరీక్షలు చేయడం సరికాదని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని