కౌన్సిల్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో కౌన్సిల్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో...

Published : 30 Jul 2020 13:52 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కౌన్సిల్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఎన్నిక జరగనుంది. ఆగస్టు 6న నోటిఫికేషన్‌ విడుదల, 13న నామినేషన్ దాఖలు, ఆగస్టు 24న పోలింగ్‌, అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎమ్మెల్సీ, మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణను వైకాపా అధిష్ఠానం రాజ్యసభకు పంపించడంతో ఆ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ పదవికోసం వైకాపాలోని పలువురు ఆశావహులు పోటీపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని