గ్రేటర్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8గంటలకు ప్రారంభమైంది.

Updated : 04 Dec 2020 12:36 IST

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం  మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి సర్కిల్‌ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్‌ ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్‌కు 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్‌ సూపర్‌ వైజర్‌, ఇద్దరు కౌంటింగ్‌ అసిస్టెంట్లను నియమించారు. ప్రతి టేబుల్‌ వద్ద సీసీ కెమెరాలతో కౌంటిగ్‌ ప్రక్రియ మొత్తం రికార్డు చేస్తున్నారు.

తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టారు. గ్రేటర్‌ ఎన్నికల్లో 74లక్షల 67,256 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముందుగా పోలింగ్‌ కేంద్రాల వారీగా పోలైన ఓట్లను బాక్సుల్లో నుంచి తీసి 25 బ్యాలెట్ల చొప్పున బండిల్‌గా కడతారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్లు నిషేధించారు. అత్యంత తక్కువగా ఓట్లు పోలైన మెహిదీపట్నంలో మొదటి రౌండ్‌లోనే ఫలితం తేలనుంది. అత్యధికంగా ఓట్లు పోలైన మైలాన్‌దేవ్‌పల్లి డివిజన్‌తో పాటు మరో 11 డివిజన్లలో 3 రౌండ్లలో లెక్కింపు జరగనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని