
ఇద్దరికీ చూపు లేదు.. కరెంటు బిల్లు రూ.58లక్షలు
భువనేశ్వర్ : ఒడిశాలోని ఓ నిరుపేద అంధుల కుటుంబానికి ఏకంగా రూ.58లక్షల విద్యుత్ బిల్లు రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. పంచదయాన్ గ్రామానికి చెందిన ప్రసన్నానాయక్, అతని భార్య ఇద్దరూ అంధులే. వీరి ఇంట్లో కేవలం నాలుగు విద్యుద్దీపాలు, రెండు ఫ్యాన్లు మాత్రమే ఉన్నాయి.
వీటికి ఏడునెలలుగా విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో భారీ మొత్తంగా రూ.58 లక్షల విద్యుత్ బిల్లును వడ్డించారు. దీనిని చూసిన ప్రసన్నానాయక్ కుటుంబం ఇంత డబ్బు తాము చెల్లించలేమన్నారు. గతంలోనూ ఇదేవిధంగా రూ.18వేల బిల్లు వస్తే అధికారులను కలిసి రూ.9,700 చెల్లించామని తెలిపారు. అయితే ఇప్పుడు ఇంత డబ్బు తాము చెల్లించలేమని.. ఇదివరకే విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశామని నాయక్ తెలిపారు. సమస్యపై అధికారులు స్పందించకుంటే వినియోగదారుల ఫోరమ్ను ఆశ్రయిస్తామని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.