పిల్లి అనుకొని కొని..  అరెస్టయ్యారు..

ఫ్రాన్స్‌కు చెందిన ఓ జంట పెంపుడు పిల్లిని కొనుగోలు చేసి అరెస్టయ్యారు. ఆన్‌లైన్‌లో వచ్చిన పిల్లుల ప్రకటనను చూసిన ఈ జంట ఓ పిల్లి ముద్దుగా ఉండటంతో దాన్ని పెంచుకోవాలనుకున్నారు. ప్రకటన ఆధారంగా ఆర్డర్‌ చేసి

Published : 12 Oct 2020 22:53 IST

పారిస్‌ : ఫ్రాన్స్‌కు చెందిన ఓ జంట పెంపుడు పిల్లిని కొనుగోలు చేసి అరెస్టయ్యారు. ఆన్‌లైన్‌లో వచ్చిన పిల్లుల ప్రకటనను చూసిన ఈ జంట ఓ పిల్లి ముద్దుగా ఉండటంతో దాన్ని పెంచుకోవాలనుకున్నారు. ప్రకటన ఆధారంగా ఆర్డర్‌ చేసి మూడు నెలల వయసు ఉన్న పిల్లి పిల్లను తెప్పించుకున్నారు. ఆరు వేల యూరోలు పెట్టి దంపతులు కొనుగోలు చేశారు. 

వారం తర్వాత దంపతులు తాము కొనుగోలు జంతువు పిల్లి పిల్ల కాదు.. పులి పిల్ల అని తెలుసుకొని అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు ఈ సమాచారాన్ని తెలియజేశారు. 2018లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు సుదీర్ఘ విచారణ చేశారు. కొన్ని స్పష్టమైన తేడాలు ఉన్నప్పటికీ సవన్నా జాతికి చెందిన పిల్లి అనుకొని తాము కొనుగోలు చేసిన జంతువు.. ఇండోనేసియా దేశానికి చెందిన సుమత్రా పులి పిల్ల అని కనుగొనలేకపోయామని వాళ్లు పోలీసులకు వివరించారు. 

వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఎటువంటి అనుమతి లేకుండా వన్యప్రాణి అక్రమ రవాణా, విక్రయించిన కేసులో దంపతులతో పాటు మరో ఏడు మందిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు తర్వాత దంపతులు ఇచ్చిన వివరణతో వారిని పోలీసులు విడుదల చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ పులిని ఫ్రాన్స్‌లోని జీవవైవిధ్య సంబంధ కార్యాలయంలో ఉంచారు. 

 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని