కరోనా సోకితే.. ఒళ్లంతా కలకలం!

కరోనా దాడి కేవలం ఊపిరితిత్తులు, గుండెకు మాత్రమే పరిమితం కావడంలేదు. మన ఒంట్లోని అణువణువునీ ప్రభావితం చేస్తోంది........

Published : 09 Aug 2020 00:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా దాడి కేవలం ఊపిరితిత్తులు, గుండెకు మాత్రమే పరిమితం కావడంలేదు. మన ఒంట్లోని అణువణువునీ ప్రభావితం చేస్తోంది. తల మొదలుకొని పాదాల వరకు శరీరంలోని అనేక అవయవాలపై ఈ వైరస్‌ ప్రభావం, దాడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇవన్నీ తెలుసుకోవడం భయపడటానికి కాదు. తెలుసుకొని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో దేహంలో కరోనా వైరస్‌ దాడి గురించి అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

తుపాను వచ్చి దాని తీవ్రత తగ్గాకే జరిగిన నష్టం మనకు తెలుస్తుంది. ప్రస్తుతం కరోనా విషయంలో కూడా అదే జరుగుతోంది. ప్రాణాంతకమైన ఈ వైరస్‌ బారినపడి వ్యాధి నిరోధకశక్తి ఉన్న కారణంగా కోలుకున్నప్పటికీ మన ఒంట్లో జరుగుతున్న నష్టం అపారం. నిన్న మొన్నటి వరకు  దీని దాడి ఊపిరితిత్తులపైనే ఉంటుందని భావించేవారు. కానీ వైరస్‌ దాడి కేవలం ఊపిరితిత్తులకే పరిమితం కావడంలేదు. ఒంట్లోని అణువణువునూ కబళిస్తోంది. గుండె, కిడ్నీలు,  మెదడు వంటి కీలక అవయవాలను దెబ్బతీస్తుంది. 

బయటి నుంచి మన ఒంట్లోకి చేరిన వైరస్‌.. తొలుత మన నాసికా రంధ్రాల్లో తిష్ట వేస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా ముక్కు నుంచి గొంతులోకి.. అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. అక్కడి నుంచి గుండెలోకి విస్తరిస్తుంది. కరోనా వైరస్‌ మన శరీరంలోని కణాలకు అతుక్కొనేందుకు తోడ్పడే  ACE-2 ఎంజైమ్‌ ఊపిరితిత్తులతో పాటు గుండె కణాల్లోనూ ఉంటుంది. దీంతో ఈ వైరస్‌ చాలా తేలికగా గుండెకు విస్తరిస్తుంది. కొవిడ్‌ 19 రోగుల్లో ఇటీవల కొందరు ఆకస్మికంగా మరణిస్తున్నారు. ఈ హఠాన్మరణాలకు చాలా వరకు మయో కార్డైటీస్‌ కారణమంటున్నారు వైద్యులు. కరోనా వైరస్‌ మన శరీరంపై ఇంకా ఎలాంటి ప్రభావం చూపుతుందో, ఎలాంటి సమస్యలు వస్తాయో ప్రముఖ కార్డియాలజిస్ట్‌ ఎం.ఎస్‌.ఎస్‌. ముఖర్జీ చెప్పే మరెన్నో విషయాలు తెలుసుకొనేందుకు ఈ వీడియో చూడండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని