రూ.400తో కరోనా పరీక్ష

కరోనా నిర్ధారణకు పశ్చిమ్‌ బంగ రాష్ట్రం ఖరగ్‌పూర్‌ ఐఐటీ ఆచార్యుల బృందం ‘కొవిడ్‌-19 పోర్టబుల్‌ ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌’ను రూపొందించింది. ఆ కిట్‌ను ఐఐటీ సంచాలకులు వి.కె.తివారి శనివారం ప్రయోగశాలలో ఆవిష్కరించారు..

Updated : 26 Jul 2020 08:02 IST

ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ను ఆవిష్కరించిన ఖరగ్‌పూర్‌ ఐఐటీ

ఖరగ్‌పూర్‌: కరోనా నిర్ధారణకు పశ్చిమ్‌ బంగ రాష్ట్రం ఖరగ్‌పూర్‌ ఐఐటీ ఆచార్యుల బృందం ‘కొవిడ్‌-19 పోర్టబుల్‌ ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌’ను రూపొందించింది. ఆ కిట్‌ను ఐఐటీ సంచాలకులు వి.కె.తివారి శనివారం ప్రయోగశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఐఐటీ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఆచార్య సుమన్‌ చక్రవర్తి, బయోసైన్స్‌ విభాగం ఆచార్యులు అరిందం మండల్‌ బృందం దీన్ని రూపొందించారన్నారు. ఈ కిట్‌ వైద్యపరీక్షల నివేదికను గంటలోనే అందిస్తుందని, ఖర్చు రూ.400లోపే ఉంటుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని