పెన్సిల్‌తో వి‘చిత్రం’

నృత్యం, బొమ్మలు గీయటం, పాటలు బాగా పాడటం వంటి నైపుణ్యాలు అందరికీ సాధ్యం కావు. ముఖ్యంగా బొమ్మలు గీయాలంటే ఎంతో చిత్తశుద్ధి కావాలి. దాంతోపాటు వాటిని నేర్చుకోవాలన్న తపనా, ఆసక్తి ఉండాలి.

Published : 23 Oct 2020 22:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  నృత్యం, బొమ్మలు గీయటం, పాటలు బాగా పాడటం వంటి నైపుణ్యాలు అందరికీ సాధ్యం కావు. ముఖ్యంగా బొమ్మలు గీయాలంటే ఎంతో చిత్తశుద్ధి కావాలి. దాంతోపాటు వాటిని నేర్చుకోవాలన్న తపన, ఆసక్తి ఉండాలి. ఇతరులను తమ కళతో ఆకట్టుకోవాలంటే ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉండాలి. అలా వైవిధ్యం కోసం ప్రయత్నించే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తే సత్య శివప్రసాద్‌. జీవత్వం ఉట్టిపడేలా చిత్రాలను గీస్తూ అద్భుతాలు చేస్తున్నారు.  అది కూడా కేవలం పెన్సిల్‌తో. వైవిధంగా చిత్రాలు గీసి జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకున్న శివప్రసాద్‌ గురించి మీరు తెలుసుకోండి. 

శివప్రసాద్‌ ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చిత్రకారుడు. పెన్సిల్‌తో అద్భుతమైన చిత్రాలు గీసి ఔరా అనిపిస్తున్నారు. వృత్తి రీత్యా స్టీల్‌ వ్యాపారం చేస్తున్నారు. డిగ్రీ వరకు విద్యాభ్యాసం చేసిన ఆయనకు చిన్నప్పటి నుంచి చిత్రాలు గీయటమంటే చాలా మహాప్రాణం. పాఠశాల దశ నుంచే పలుబొమ్మలు గీసి జాతీయ స్థాయిలో 30కి పైగా అవార్డులు సొంతం చేసుకున్నారు. వ్యాపారం చేస్తూనే తీరిక సమయాల్లో చిత్రాలను గీస్తున్నారు. వ్యాపారంలో ఉన్నప్పటికి తనకు ఇష్టమైన కళను విస్మరించలేదాయన. ‘‘వృత్తి రీత్యా నేను స్టీల్ వ్యాపారం చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి చిత్రాలు గీయటమంటే ఇష్టం. అయితే  గీసిన చిత్రాలు వైవిధ్యంగా ఉండాలి, జీవత్వం ఉట్టి పడాలన్నదే  నా కోరిక. పెన్సిల్‌తో గీసిన వాటిలోనే అన్ని రకాల షేడ్లు చూపించాలన్న ఆశయంతో ఈ ఆర్ట్‌ను ఎన్నుకున్నాను’’ అని శివప్రసాద్‌ పేర్కొన్నారు. 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని