స్పీడ్‌ బోట్‌తో మొసలి పందెం..!

ఓ భారీ మొసలి నీటిలో అతివేగంగా ప్రయాణిస్తున్న ఓ స్పీడ్‌ బోట్‌తో పోటీపడింది.

Published : 10 Sep 2020 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొసలిని జల ప్రపంచానికి రారాజు అంటారు. అది నీటిలో ఉండగా ఓడించడం మరే ఇతర ప్రాణికీ సాధ్యం కాదని నమ్మకం. చూడాలంటేనే భయం వేసే ఆకారం కలిగిన మొసలి.. నీటిలో నెమ్మదిగా ఈదడం మనం టీవీల్లో చూసుంటాం. కానీ తన వేగాన్ని కూడా నిరూపించుకోవాలనుకుందో ఏమో ఈ మొసలి.. నీటిలో అతివేగంగా ప్రయాణిస్తున్న ఓ స్పీడ్‌ బోట్‌తో పోటీపడింది. దీన్ని ఆ బోటులో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. నీటిలో ఉన్న మొసలికుండే శక్తి విషయంలో ఏ సందేహం లేకున్నా.. అది ఇంత వేగంగా ఈదగలదని ఊహించలేదంటూ పలువురు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ మకరం వేగమెంతో మీరూ చూడండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని