ప్లాస్మా దాతలు దేవుడితో సమానం: సజ్జనార్

ప్లాస్మా దానం చేసిన ప్రతి ఒక్కరూ దేవుడితో సమానమని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ సీపీ కార్యాలయంలో హోం మంత్రి మహమూద్‌ అలీతో కలిసి ప్లాస్మా దాతలను ...

Published : 27 Aug 2020 13:11 IST

హైదరాబాద్‌: ప్లాస్మా దానం చేసిన ప్రతి ఒక్కరూ దేవుడితో సమానమని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ సీపీ కార్యాలయంలో హోం మంత్రి మహమూద్‌ అలీతో కలిసి ప్లాస్మా దాతలను సీపీ సజ్జనార్‌ సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ సమయంలో సైబరాబాద్‌ పోలీసులు 5,300 బ్లడ్‌ యూనిట్లు సేకరించినట్లు చెప్పారు. 600 మంది ప్లాస్మా దానం చేసి 1,350 మంది ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు. ప్లాస్మాదానంలో వాలంటీర్లు, కరోనా నియంత్రణలో మీడియా పాత్ర కీలకమన్నారు. ప్లాస్మా దానంలో తెలంగాణ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని సీపీ పేర్కొన్నారు.

అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పోలీసు శాఖకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో పోలీసుల సేవ ఎనలేనిదని కొనియాడారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సైతం తెలంగాణ పోలీసుల పనితీరు మెచ్చుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. ప్లాస్మా దానం చేసిన ప్రతి ఒక్కరికీ మహమూద్‌ అలీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరూ మాస్కు, శానిటైజర్‌ తప్పనిసరిగా వాడాలని ఈ సందర్భంగా సూచించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని