Published : 18/10/2020 03:36 IST

దుర్గం చెరువు వంతెనపై రాకపోకలకు అనుమతి

హైదరాబాద్: కుండపోతగా కురుస్తున్న వర్షానికి జంట నగరాల్లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని కూడళ్లలో ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ క్రమంలో మాదాపూర్‌లో నెలకొన్న ట్రాఫిక్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దుర్గం చెరువు వంతెనపై వాహనాల రాకపోకలకు సైబరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు అనుమతించారు. ఇవాళ, రేపు (17, 18వ తేదీల్లో) వాహనాలను అనుమతించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌, హైటెక్‌ సిటీ మధ్య రాకపోకలు సాగించే వారు ఈ వంతెనను ఉపయోగించుకోవచ్చని సైబరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. సాధారణంగా శని, ఆదివారాల్లో ఈ వంతెనపై వాహనాల రాకపోకలు నిలిపివేసి కేవలం సందర్శకులను మాత్రమే అనుమతించేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో సందర్శకులు వంతెన సందర్శనకు రాకూడదంటూ సైబరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని