ఉద్యోగ కల్పనకు మరో ముందడుగు

తెలంగాణలో ఉద్యోగ కల్పనకు ఉద్దేశించిన డిజిటల్‌ యాప్‌ ‘డీట్‌’ అమెరికాకు చెందిన మల్టీ నేషనల్‌ కంజ్యూమర్‌ క్రెడిట్‌ రిపోర్టింగ్‌ ఏజెన్సీ ఎక్విఫాక్స్‌తో చేతులు కలిపింది....

Published : 19 Dec 2020 11:53 IST

ఎక్విఫాక్స్‌తో చేతులు కలిపిన ‘డీట్‌’

హైదరాబాద్‌: తెలంగాణలో ఉద్యోగ కల్పనకు ఉద్దేశించిన డిజిటల్‌ యాప్‌ ‘డీట్‌’ అమెరికాకు చెందిన మల్టీ నేషనల్‌ కంజ్యూమర్‌ క్రెడిట్‌ రిపోర్టింగ్‌ ఏజెన్సీ ఎక్విఫాక్స్‌తో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగడంతోపాటు, డిజిటల్‌ యాప్‌లో సేవల విస్తరణ, ఉద్యోగార్థుల ఐటీ వెరిఫికేషన్‌, ఉద్యోగాల కల్పన సులభం కానుంది. డిజిటల్‌ యాప్‌లో నమోదైన నిరుద్యోగులు ఎక్విఫాక్స్‌ ద్వారా రిజిస్టర్‌ అయిన సంస్థల నుంచి రుణ సదుపాయం పొందేందుకు వీలు కలుగుతుంది. ఈ భాగస్వామ్యం పట్ల తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగార్థుల వెరిఫికేషన్‌ వేగవంతమై కంపెనీలు అర్హులైన మానవ వనరులను ఎంపిక చేసుకునేందుకు ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందన్నారు. ఐటీ రంగంలో అవకాశాలకు తెలంగాణ రాష్ట్రం బంగారు గని వంటిదని కేటీఆర్‌ ఈసందర్భంగా పేర్కొన్నారు.

ఇవీ చదవండి...

2021లో ఉద్యోగావకాశాలు పెరుగుతాయ్‌

TS:ఉద్యోగ నియామకాలకు ప్రత్యేక సెల్‌
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని