Published : 18 Jul 2020 19:40 IST

ఆ నలుగురూ లేరు.. రిక్షాపైనే అంత్య క్రియలకు!

బెలగావి: కరోనా మహమ్మారి అనేక దయనీయ పరిస్థితులకు దారితీస్తోంది. సహజంగా మరణించినా.. కరోనా భయంతో బంధువులు కానీ, చుట్టుపక్కలవారు కానీ అంతిమ సంస్కారాలకు ముందుకు రావడంలేదు. కర్ణాటకలోని బెలగావి జిల్లా అథాని నివాసి గత కొద్ది కాలంగా అనారోగ్యంలో బాధపడుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. అయితే కొవిడ్‌ భయంతో బంధువులు, తెలిసినవారు ఎవరూ కూడా మృతదేహాన్ని చూసేందుకు రాలేదు. దీంతో మృతుడి కుమారుడు తండ్రి శవాన్ని రిక్షాపై తోసుకుంటూ స్మశానవాటికకు తీసుకెళ్లాడు. అనంతరం మృతుడి భార్య, కుమారుడే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts