Published : 15 Oct 2020 22:55 IST

దిల్లీలో డీజిల్‌ జనరేటర్ల వాడకంపై నిషేధం 

దిల్లీ: దేశ రాజధానిలో గాలి నాణ్యత ప్రమాణాలు దారుణంగా పడిపోవడంతో దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) డీజిల్‌ జనరేటర్ల వాడకంపై గురువారం నుంచి నిషేధం విధించింది. దిల్లీలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీపీసీసీ ఆదేశాలు జారీ చేసింది.

త్వరలో శీతాకాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దిల్లీలోని గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) 50 బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు గాలి కాలుష్యానికి కారణమవుతున్న అంశాలను పరిశీలించనున్నాయి. ఇవి ఇచ్చే వివరాల ఆధారంగా దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ గాలి నాణ్యత మెరుగయ్యేందుకు పని చేయాల్సి ఉంటుంది. 

కాలుష్య నియంత్రణపై ఇటీవల జరిగిన సమావేశంలో దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ పాల్గొన్నారు. దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతులు వ్యవసాయ వ్యర్థాలకు నిప్పు పెట్టడం ద్వారా వచ్చే పొగ వల్ల గాలి నాణ్యత మరింత పడిపోతోందన్నారు. ఆ వ్యర్థాలకు నిప్పు పెట్టకుండా టెక్నాలజీ ద్వారా వాటిని తొలగించగలిగితే గాలి నాణ్యత ప్రమాణాలు మెరుగవుతాయాని వివరించారు. గాలి కాలుష్య నియంత్రణకు ఇటీవల దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ‘యుద్ధ్‌ ప్రదుషా కే విరుద్ధ్‌’ అనే కార్యక్రమాన్ని  రూపొందించారు.

రెడ్‌లైట్‌ ఆన్‌... గాడీ ఆఫ్‌!

కాలుష్య నియంత్రణకు దిల్లీ ప్రభుత్వం మరో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం ‘రెడ్‌ లైట్‌ ఆన్‌.. గాడీ ఆఫ్’ ప్రచారాన్ని ప్రారంభించారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్ వద్ద వేచి ఉన్నప్పుడు వాహనాల ఇంజిన్లను ఆపివేయాలని ప్రజలను కోరారు. ‘‘రెడ్‌ లైట్‌ ఆన్‌..గాడీ ఆఫ్‌’ ప్రచారాన్ని ‘యుద్ధ్‌ ప్రదూషణ్ కే విరుద్ధ్‌’లో భాగంగా ప్రారంభించాం. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద వేచి ఉన్నప్పుడు వాహనాల ఇంజిన్‌లను ఆపివేస్తామని అందరం ప్రతిజ్ఞ చేద్దాం. కాలుష్య నియంత్రణలో ఏ చిన్న అవకాశాన్నీ వదలొద్దు’’ అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని