
దూరం పాటించాలంటున్న దిల్లీ పోలీసులు
ఇంటర్నెట్ డెస్క్ : కరోనా నుంచి తమను తాము రక్షించుకోవాలంటే భౌతిక దూరం పాటించటం కన్నా ఉత్తమమైనది మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు, పోలీసులు, డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. ముఖ్యంగా కొవిడ్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పోలీసులు సామాజిక మాధ్యమాల ద్వారా నిత్యం అవగాహన కల్పిస్తున్నారు. ఈ కోవకు చెందినదే దిల్లీ పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ మీమ్. భౌతిక దూరం ఎలా పాటించాలో చక్కగా అర్థం అయ్యేలా ఉందీ ఈ మీమ్‌లో. ‘కొవిడ్ బారిన పడొద్దంటే భౌతిక దూరం పాటించటం తప్పని సరి’ అనే వ్యాఖ్యను దీనికి జత చేశారు. ఈ పోస్టును చూసిన నెటిజన్లు దిల్లీ పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వారిని పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. ‘‘వీరిని చూసి గర్విస్తున్నా’’అని ఓ నెటిజన్ కామెంట్ పెడితే...‘‘లవ్ యూ దిల్లీ పోలీస్ ’’అని మరొకరు రాసుకొచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.