జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ ఆలయం వద్ద భక్తుల రద్దీ

విజయదశమి సందర్భంగా నగరంలోని జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు.

Published : 26 Oct 2020 01:06 IST

హైదరాబాద్‌: విజయదశమి సందర్భంగా నగరంలోని జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని తెల్లవారుజూము నుంచే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వేలాది మంది భక్తులు పెద్దమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. శరన్నవరాత్రి వేడుకలకు 4 నుంచి 5లక్షల మంది భక్తులు పాల్గొనగా ఇవాళ దసరా సందర్భంగా 35వేలకు పైగా భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని