దసరా రోజే ‘ధరణి’ ప్రారంభం

కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా తీసుకొస్తున్న  ధరణి పోర్టల్‌ దసరా పండుగ రోజు ప్రారంభం కానుంది. ప్రజలు మంచి ముహూర్తంగా భావించే విజయదశమి రోజున పోర్టల్‌ను ప్రారంభించాలని............

Published : 27 Sep 2020 01:45 IST

హైదరాబాద్‌: కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా తీసుకొస్తున్న  ధరణి పోర్టల్‌ దసరా పండుగ రోజు ప్రారంభం కానుంది. ప్రజలు మంచి ముహూర్తంగా భావించే విజయదశమి రోజున పోర్టల్‌ను ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ముఖ్యమంత్రే స్వయంగా ఈ పోర్టల్‌ను ప్రారంభిస్తారు. ప్రారంభానికి అనువుగా అవసరమైన అన్ని కార్యక్రమాలను ఈ లోపు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మారిన రిజిస్ట్రేషన్‌ విధానం, వెంటనే మ్యుటేషన్‌, ధరణి పోర్టల్‌కు వివరాలను అప్‌డేట్‌ చేయడం తదితర అంశాలు, విధివిధానాలపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్లకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు. నమూనా ట్రయల్స్‌ కూడా నిర్వహించి అధికారులకు అవగాహన కల్పించాలన్నారు.  

ప్రతి మండలానికి ఒకరు చొప్పున ప్రతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్ల నియామకం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ధరణి పోర్టల్‌ ప్రారంభానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నంబర్ల వారీగా రిజిస్ట్రేషన్‌ ధరలను నిర్ణయిస్తామన్న సీఎం.. వాటి ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. తహసీల్దార్‌, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డాక్యుమెంట్‌ రైటర్లకు లైసెన్సులతో పాటు శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు చెప్పారు. దసరాలోగా అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ఆ తర్వాత జరిగే మార్పులు, చేర్పులు వెంటవెంటనే నమోదవుతాయని పేర్కొన్నారు. దసరా రోజు నుంచే రిజిస్ట్రేషన్లు తిరిగిప్రారంభమవుతాయని, అంతవరకు ఎలాంటి రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ వ్యవహారాలు జరగబోవని సీఎం స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని