ప్లాస్మాదానం చేసిన మొదటి కేంద్ర మంత్రి ఆయనే!

 కేంద్ర ఉక్కు, ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శనివారం ప్లాస్మా దానం చేశారు. ఇటీవల  కరోనా నుంచి కోలుకున్న ఆయన ప్లాస్మా దానం చేసిన మొదటి కేంద్రమంత్రిగా నిలిచారు. అదేవిధంగా మహమ్మారిని జయించిన  ప్రజలు కూడా ప్లాస్మాదానం చేయడానికి ముందుకు రావాలని  కోరారు.

Updated : 04 Oct 2020 01:41 IST

దిల్లీ: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శనివారం ప్లాస్మా దానం చేశారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న ఆయన ప్లాస్మా దానం చేసిన మొదటి కేంద్రమంత్రిగా నిలిచారు. మహమ్మారిని జయించిన ప్రజలు కూడా ప్లాస్మాదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ప్లాస్మా దానం చేయడం తనకు చాలా సంతృప్తి కలిగించిందన్నారు. మహమ్మారిని జయించిన తరువాత ప్లాస్మా దానం చేయాలని ఇదివరకే నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కరోనా సోకిన తరువాత దాని నుంచి కోలుకున్న వారి ప్లాస్మాలో కొవిడ్‌ -19కు సంబంధించిన యాంటీబాడీలు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ యాంటీబాడీలు ఉన్న ప్లాస్మాను ఇవ్వటం వల్ల కొవిడ్‌తో బాధపడుతున్న వారు త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని