దవా చాయ్‌.. రోగనిరోధకశక్తి పెంచుతుంది..

కరోనా మహమ్మారి బారిన పడకుండా భౌతిక దూరం, మాస్కులు ధరించడంతోపాటు రోగనిరోధకశక్తి..

Updated : 27 Jul 2020 11:55 IST

రోగనిరోధకశక్తిని పెంచుతుందన్న ఆయుర్వేద నిపుణుడు డా.గుమ్మడవెల్లి శ్రీనివాస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి బారిన పడకుండా భౌతిక దూరం, మాస్కులు ధరించడంతోపాటు రోగనిరోధకశక్తి కీలకంగా మారింది. వ్యాధినిరోధకశక్తి ఎక్కువగా ఉన్నవాళ్లు కరోనాను తట్టుకొని త్వరగా కోలుకుంటున్నారు. అందుకు ఆహారపు అలవాట్లతోపాటు వంటింటి చిట్కాలు పాటించడం మరో కారణమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆయుర్వేద వైద్యులు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఆయుర్వేద వైద్యంలో 20 సంవత్సరాల అనుభవమున్న ప్రముఖ నిపుణుడు గుమ్మడవెల్లి శ్రీనివాస్‌ రోగనిరోధకశక్తిని పెంపొందించుకునేందుకు ఓ చిట్కాను సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ దరిచేరకుండా ఉండాలంటే రోజూ ఒక కప్పు ‘దవా చాయ్‌’ని సేవించాలని సూచిస్తున్నారు. దవా చాయ్‌ శరీరంలోని పిత్తం శాతాన్ని పెంచి కొవిడ్‌ను ఎదుర్కొనే గుణాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఆయుష్‌ విభాగం సూచించిన మూలికలకు తోడు అదనంగా మరో 20 రకాల మూలికలను సేకరించినట్లు శ్రీనివాస్‌ తెలిపారు. ఆయుర్వేదంలో ప్రభావంగా పనిచేసే అశ్వగంధ, శతావరి, నేలవేము, నేల ఉసిరి, తిప్పతీగ, పచ్చి పసుపు, శొంటి, మిరియాలు, లవంగాలు, యాలకులు వంటి 24 రకాల వనమూలికలు ఈ ఆయుర్వేద చాయ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. వీటితో ద్రావణాన్ని తయారు చేసి కరోనా బాధితులు, వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియాకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు రూ.30 లక్షల విలువైన దవా చాయ్‌ పొట్లాలను పంపిణీ చేసినట్లు శ్రీనివాస్‌ తెలిపారు. మరింత మందికి ఈ ప్యాకెట్లను ఉచితంగా పంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. దాతలు సహకరిస్తే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులు, ఇతర సిబ్బందికి అందిస్తానని వెల్లడించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని