రాయితీ ఉల్లి.. ఏడున్నవే తల్లీ!

ఖరీదైనదిగా మారి, సామన్యుడు కొనలేని స్థితికి చేరిన ఉల్లి.. కొంతకాలం నుంచి వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ధరలు పెరగటానికి కారణాలు ఏవైనా కొనాలంటే

Published : 01 Nov 2020 01:34 IST

అమరావతి‌: ఖరీదైనదిగా మారి, సామన్యుడు కొనలేని స్థితికి చేరిన ఉల్లి.. కొంతకాలం నుంచి వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ధరలు పెరగటానికి కారణాలు ఏవైనా కొనాలంటే మాత్రం వినియోగదారుడు కన్నీరు పెట్టుకునేలా చేస్తోందీ ఉల్లి. ఈ నేపథ్యంలో రాయితీపై ఉల్లిని విక్రయిస్తామని, కిలో ఉల్లి రూ.40కే వినియోగదారుడికి అందేలా చేస్తామని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. కానీ ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా సక్రమంగా అమలు కావటం లేదని ప్రజలు వాపోతున్నారు. రైతు బజార్లో రాయితీ ఉల్లి అందుబాటులో లేక... బయట అధిక ధరలకు కొనలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా జిల్లా కంచిక చర్ల రైతు బజార్లోని పరిస్థితి ఇది. ఇక్కడ రాయితీ ఉల్లి అందుబాటులో ఉండేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని