కారు డ్రైవింగ్‌లోనూ మాస్కు పెట్టుకోవాలా?

కారులో ఒంటరిగా డ్రైవింగ్‌ చేస్తు్న్నప్పుడు మాస్క్‌ పెట్టుకోవాలా? వ్యాయామంలో భాగంగా సైక్లింగ్‌ చేస్తున్నప్పుడు మాస్క్‌ ధరించాలా? ఇలాంటి సందేహాలకు తాజాగా సమాధానం....

Published : 04 Sep 2020 01:26 IST

దిల్లీ: కారులో ఒంటరిగా డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు మాస్క్‌ పెట్టుకోవాలా? వ్యాయామంలో భాగంగా సైక్లింగ్‌ చేస్తున్నప్పుడు మాస్క్‌ ధరించాలా? ఇలాంటి సందేహాలకు తాజాగా సమాధానం దొరికింది. అలాంటి సందర్భాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్న మార్గదర్శకాలు ఏవీ లేవని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ స్పష్టంచేశారు. మాస్కులు ధరించని కారణంగా చలాన్లు విధిస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఓ ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. అయితే, గుంపులో జాగింగ్‌, సైక్లింగ్‌ చేస్తే మాత్రం తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని సూచించారు. ఒకరి నుంచి ఒకరికి ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా భౌతిక దూరం పాటించాలన్నారు. కారులోనూ ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఈ నిబంధనలు వర్తిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని