
బ్యాట్‌మన్ డ్రెస్సులో వైద్యుడు.. వైరల్ వీడియో
ఇంటర్నెట్ డెస్క్ : చావుబతుకుల మధ్య ఉన్న వాళ్ల ప్రాణాలను కాపాడే వైద్యులను దేవుళ్లుగా పిలుస్తుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు వైద్యం చేసే డాక్టర్లు ఎంతో ఓపికతో వ్యవహరిస్తూ చికిత్స అందిస్తుంటారు. రోగుల ఆరోగ్య సమస్యలను తీర్చడానికి వైద్యులు తమ శాయశక్తుల ప్రయత్నిస్తుంటారు. ఇదిలా ఉంటే అమెరికాలోని నార్త్ డకోటాకు చెందిన ఓ బాలుడు క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. వ్యాధి తీవ్రతరం కావడంతో ఆ చిన్నారి ఎన్ని రోజులు బతుకుతాడో కూడా తెలియని పరిస్థితి. ఈ క్రమంలో వైద్యం అందిస్తున్న వైద్యుడు ఆ చిన్నారి చివరి కోరిక ఏంటో తెలుసుకొని దాన్ని నెరవేర్చాలనుకున్నాడు.
‘సూపర్‌హీరోస్’ క్యారెక్టర్లను బాగా ఇష్టపడే ఆ చిన్నారి తనకు బ్యాట్‌మన్‌ను కలవాలని ఉందని వైద్యుడికి చెప్పాడు. బాలుడి కోరిక తీర్చేందుకు వైద్యుడే బ్యాట్‌మన్ డ్రెస్సులో ఆసుపత్రికి వచ్చి చిన్నారికి కనిపించిన భావోద్వేగమైన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఫీల్‌గుడ్ అనే ట్విటర్ అకౌంట్‌లో ఉన్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. ఈ వీడియోలో బ్యాట్‌మన్ డ్రెస్సులో చిన్నారికి కనిపించిన వైద్యుడు బాలుడిని హత్తుకొని ధైర్యం చెప్పాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.