ఇకపై ఆన్‌లైన్‌లోనే డ్రైవింగ్‌ లైసెన్స్‌

ప్రజలకు  మరింత చేరువ అయ్యేందుకు తెలంగాణ రవాణాశాఖ మరో 5 రకాల సేవలను ఆన్‌లైన్‌ పరిధిలోకి తెచ్చింది.

Published : 24 Jul 2020 21:08 IST

పువ్వాడ అజయ్‌

హైదరాబాద్‌: ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు తెలంగాణ రవాణాశాఖ మరిన్ని ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫెస్ట్‌ (ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టు) పేరిట ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఈ సేవలను ప్రారంభించారు. వీటి ద్వారా 5 రకాల ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజల సమయం వృథా కాకుండా పారదర్శకత కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇకపై డూప్లికేట్‌ లెర్నింగ్‌ లైసెన్స్‌, బ్యాడ్జీలను అందజేయడం, డూప్లికేట్‌ లైసెన్స్‌, హిస్టరీ షీట్‌, పాతకార్డు స్థానంలో స్మార్ట్‌ కార్డులను ఇవ్వడం వంటి 5 రకాల సేవలను ఆన్‌లైన్‌ ద్వారా అందించనున్నారు. మరో ఆరు సేవల్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వివరించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పని చేసే ఈ సేవలను మొబైల్‌లో పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అనేక సంస్కరణలు వచ్చాయని, మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా దేశంలోనే తొలిసారిగా రవాణాశాఖలో ఆన్‌లైన్‌ సేవలను ప్రారంభించడం గర్వంగా ఉందని అజయ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని