రవాణా సౌకర్యం లేదని.. చెత్త రిక్షాలో!
సకాలంలో రవాణా సౌకర్యం లేదన్న కారణంతో అస్వస్థకు గురైన ఓ వ్యక్తిని స్థానికులు గ్రామ పంచాయితీ చెత్త రిక్షాలో ఆసుపత్రికి తరలించారు.
ఏలూరు: సకాలంలో రవాణా సౌకర్యం లేదన్న కారణంతో అస్వస్థకు గురైన ఓ వ్యక్తిని స్థానికులు గ్రామ పంచాయతీ చెత్త రిక్షాలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం ఐ. భీమవరం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి ఐ. భీమవరం బస్టాండ్లో రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గమనించిన పంచాయతీ అధికారులు, ఆరోగ్య సిబ్బంది అతడిని ఆకివీడులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడు మద్యం ఎక్కువగా సేవించడంతో గ్యాస్ ఫామ్ అయ్యిందని వైద్యులు తెలిపారు. అనంతరం అతడికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా బాధితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడిని చెత్త రిక్షాలో తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మారుమూల గ్రామం కావడం, సకాలంలో రవాణా సౌకర్యం లేకపోవడం వల్లే గ్రామ పంచాయతీకి సంబంధించిన చెత్త రిక్షాలో ఆస్పత్రికి తరలించామని అధికారులు వివరణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’ - దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?