భారత ఎన్నికల కమిషన్‌ కొత్త డేటాబేస్‌ ఏర్పాటు!

అతి సమస్యాత్మక, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్‌ జరిగే సమయంలో పోలింగ్‌ కేంద్రాలపై దాడులు జరుగుతుంటాయి. వీటిలో ఓటర్లు, పోలింగ్‌ విధులు నిర్వహించే పలువురు గాయాలు పాలవుతుంటారు. మరికొందరు ప్రాణాలు

Published : 20 Sep 2020 00:42 IST

నష్టపరిహార చెల్లింపు స్థితి తెలుసుకునేందుకు..

దిల్లీ: అతి సమస్యాత్మక, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్‌ జరిగే సమయంలో పోలింగ్‌ కేంద్రాలపై దాడులు జరుగుతుంటాయి. వీటిలో ఓటర్లు, పోలింగ్‌ విధులు నిర్వహించే పలువురు గాయాలు పాలవుతుంటారు. మరికొందరు ప్రాణాలు కోల్పోతుంటారు. వారి కుటుంబాలకు ఎన్నికల కమిషన్‌ నష్టపరిహారం చెల్లిస్తుంది. బాధితులకు చెల్లించే నష్టపరిహార ప్రక్రియ స్థితిని పర్యవేక్షించటానికి భారత ఎన్నికల సంఘం జాతీయస్థాయిలో కొత్తగా డేటాబేస్‌ను ఏర్పాటు చేయనుంది.

జమ్మూకశ్మీర్‌లో 2002 సంవత్సరం జరిగిన ఎన్నికల పోలింగ్‌ సమయంలో విధుల్లో ఉన్న కేంద్ర రిజర్వు దళ పోలీసు రమేష్‌ కుమార్‌ టెర్రరిస్టుల దాడిలో మృతిచెందారు. ఆయన భార్య ప్రమీలాదేవి తనకు భర్త మృతికి సంబంధించి నష్టపరిహారం అందలేదని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి మెయిల్‌ ద్వారా విన్నవించారు. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్‌ నష్టపరిహారం చెల్లింపు ఆలస్యం అయినందుకు అదనపు మొత్తంతో కలిపి ఆమె అకౌంట్‌లో వేశారు. నష్టపరిహారం చెల్లింపులు ఇకపై ఆలస్యం కాకుండా పర్యవేక్షించేందుకు ఆయా రాష్ర్టాల ఎన్నికల అధికారులకు ఎన్నికల సంఘం అదనపు బాధ్యతలు త్వరలో కేటాయించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని