ఇంటి నుంచే పని చేస్తున్నారా?

దేశవ్యాప్తంగా కరోనావైరస్‌ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసుకోమని చెబుతున్నాయి. దీని ఉద్యోగులకు కొంత సౌకర్యం ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ ఇబ్బందులు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంటి నుంచి పని చేసుకునే వెసులుబాటు..

Updated : 18 Sep 2020 12:33 IST

అయితే ఈ చిట్కాలు పాటిస్తే మంచిది

ఇంటర్నెట్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనావైరస్‌ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేయమని చెబుతున్నాయి. ఇది ఉద్యోగులకు కొంత సౌకర్యంగా ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ ఇబ్బందులు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంటి నుంచి పని చేసుకునే వెసులుబాటు ఇచ్చినప్పటికీ ఎంత పని జరిగిందనే విషయమై సంస్థలు లెక్కలేసుకుంటాయి. ఇచ్చిన టైంలో పని పూర్తి కాకపోతే పై నుంచి ఒత్తిడి  మామూలుగా ఉండదు. ఆఫీసుల్లో అయితే పని చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు ఉంటాయి. అదే ఇంటి దగ్గర నుంచి చేస్తే కుటుంబ సభ్యులు, ఇతరుల నుంచి చిన్నపాటి ఆటంకాలు ఏర్పటడం సహజమే. అంతేకాకుండా ఒకే చోట అలా కూర్చొని పని చేయడం వల్ల తొందరగా అలసిపోతారు. ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశమూ ఉంది. చిన్న పాటి చిట్కాలు పాటిస్తే.. ఇంటి దగ్గరున్నా హాయిగా పని చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దామా?

1. కనీసం 3 నిమిషాలు నిలబడండి
అర గంటసేపు పని చేసిన తర్వాత కనీసం 3 నిమిషాలపాటైనా నిల్చోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ తర్వాతే మళ్లీ పని ప్రారంభించాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. తొందరగా అలసిపోకుండా ఉంటారు.

2. కుర్చీ సాయంతో..
చాలా సేపటి నుంచి అలా కూర్చొని పని చేయడం కాళ్లు పట్టేస్తాయి. దీని వల్ల ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓపిక కూడా నశిస్తుంది. దీని నుంచి ఉపశమనం పొందేందుకు చిన్నపాటి వ్యాయామం చేయండి. ఎలా అంటే.. గోడకు ఎదురుగా యోగా మ్యాట్‌పై ఓ కుర్చీ ఉంచండి. దానిపై రెండు కాళ్లూ పెట్టి వెళ్లకిలా పడుకోండి. తలకింద చేతులు పెట్టి నడుము కదల్చకుండా పైకి లేవాలి. ఇలా మూడు నాలుగు సార్లు చేయండి. దీనివల్ల పొట్టపై ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాకుండా మోకాళ్ల పైభాగంలో రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది.

 

4. నడుము పట్టేయకుండా..
ఇంటి నుంచి పని చేసే వారిలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. కదలకుండా పని చేయడం వల్ల నడుము పట్టేయడానికి ఆస్కారం ఎక్కువ. ఓ వైపు నడుము నొప్పి వేధిస్తుంటే పని చేయడం చాలా కష్టమవుతుంది. దీనిని నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలంటే.. గోడకు దగ్గరగా కుర్చీని ఉంచండి. దాని ఎదుట రెండు కాళ్లూ కాస్తా ఎడం చేసి నిలబడి, నడుమును కదల్చకుండా క్రమంగా వంగుతూ కుర్చీపై రెండు చేతులు ఆనించండి. చేతుల మధ్య నుంచి తలను కిందికి వంచండి. దీని వల్ల కాలు నుంచి నడుము వరకు నిటారుగా ఉంటుంది. ఛాతీ, పొట్ట భాగం మాత్రం కిందికి వంగుతుంది. ఇలా కనీసం మూడు నిమిషాలపాటు చేస్తే మంచి ఫలితముంటుందని నిపుణులు చెబుతున్నారు.

3. మెడపై భారం పడకుండా..
అలా గంటల కొద్దీ కూర్చొని కంప్యూటర్‌ వైపు చూస్తూ పని చేయడం వల్ల చాలా మందికి మెడనొప్పి వస్తుంది. అంతేకాకుండా ఇది స్పాండిలైటిస్‌కు దారితీస్తుంది. ఆ సమస్య రాకుండా ఉండాలంటే.. రెండు కాళ్లను కాస్తా ఎడం చేసి కుర్చీపై ఉంచాలి. బోర్లా పడుకొని మోచేతులను నేలకు ఆనించి కిందికి పైకి లేవాలి. అలా చేయడం వల్ల భుజాలకు వ్యాయామం చేసినట్లవుంది. అంతేకాకుండా మెడభాగంలో రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది.

5. వెన్నునొప్పి నుంచి ఉపశమనానికి..
గంటల తరబడి పని చేసేవారికి వెన్నునొప్పి తీవ్రంగా బాధిస్తుంది. దీనిని నుంచి ఉపశమనం పొందడం చాలా సులువు. గోడకు కుర్చీని ఆన్చి, దాని ముందు మ్యాట్‌పై బోర్లా పడుకోండి. చేతులు నేలకు ఆనించి, నడుము కదల్చకుండా శరీరాన్ని కుర్చీకి సమాంతరంగా తీసుకొచ్చేందుకు వీలైనంత వరకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల వీపు భాగంగాపై అధికభారం పడుతుంది. వెన్నెముక నెమ్మదిగా వెనక్కి వంగి చాలా రిలాక్స్‌గా ఉంటుంది. అయితే, ఇప్పటికే స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నవారు, కండరాలకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు వైద్యుల సలహా మేరకే ఈ వ్యాయామాలు చేయాలి.

(నోట్‌: ఈ సూచనలు కేవలం అవగాహన కోసమే. అనారోగ్య సమస్యలు ఉన్న వారు వైద్యులను సంప్రదించి వారి సూచన మేరకు తగిన వ్యాయామాలు చేయడం మంచిది)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని