గ్రేటర్‌లో ఓటు:18 గుర్తింపుకార్డులకు అనుమతి

డిసెంబర్‌ 1న జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా మరో 18 గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకదాన్ని చూపినా ఓటు

Published : 29 Nov 2020 00:46 IST

హైదరాబాద్‌: డిసెంబర్‌ 1న జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా మరో 18 గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకదాన్ని చూపినా ఓటు వేసేందుకు అనుమతిస్తామని జీహెచ్‌ఎంసీ ఎన్నికల అథారిటీ లోకేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఓటు వేసేందుకు ముందు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు గుర్తింపు నిర్ధారణకు వాటిని చూపాల్సి ఉంటుందన్నారు. 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఆధార్‌, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఫొటోతో కూడిన సర్వీస్‌ ఐడెంటిటీ కార్డు, ఫొటోతో కూడిన బ్యాంకు పాస్‌బుక్‌, పాన్‌కార్డు, ఎన్‌పీఆర్‌ స్మార్ట్‌కార్డు, జాబ్‌కార్డు, హెల్త్‌కార్డు, ఫొటోతో కూడిన పింఛను డాక్యుమెంట్‌, రేషన్‌కార్డు, కులధ్రువీకరణ పత్రం, స్వాతంత్ర్య సమరయోధుల గుర్తింపు కార్డు, అంగవైకల్యం ధ్రువపత్రం, పట్టాదారు పాసుపుస్తకం.. ఇలా ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుందని లోకేశ్‌ కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని