బీరుట్‌ పేలుళ్ల బాధిత బాలికలకు బొమ్మలు

లెబనాన్‌ దేశానికి ఈ ఏడాది ఆగస్టు నాలుగో తేదీ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ దేశ రాజధాని బీరుట్‌లోని ఓ గోదాములో నిల్వ ఉంచిన రసాయన పదార్థాలు పేలి పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా ప్రాణాలు

Published : 30 Nov 2020 23:46 IST

 

బీరుట్: లెబనాన్‌ దేశానికి ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ దేశ రాజధాని బీరుట్‌లోని ఓ గోదాములో జరిగిన ప్రమాదంలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 4 వేల మందికి పైగా గాయపడ్డారు. ఈ భయానక ఘటనలో వందల సంఖ్యలో భవనాలు కూలిపోయాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో లెబనాన్‌కు చెందిన ప్రముఖ కళాకారిణి, పెయింటర్‌ యొలందే లబకీ(93) అనే వృద్ధురాలు చిన్నారులపై తనకున్న ప్రేమను వ్యక్తపరచాలనుకున్నారు.   

చిన్నపిల్లలంటే అమితమైన ఇష్టం ఉన్న ఆమె పేలుళ్ల సమయంలో ఆట వస్తువులను కోల్పోయిన బాలికల ముఖంపై చిరు నవ్వు చూడాలని నిర్ణయించుకున్నారు. తన స్వహస్తాలతో బొమ్మలను చేసి బాలికలకు ఇవ్వాలని పేలుళ్లు జరిగిన మరుసటి రోజు నుంచే వాటిని తయారు చేస్తున్నారు. ఆగస్టు నాలుగో తేదీ పేలుళ్లు సంభవించగా ఆ మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే బొమ్మలను తయారు చేయడం మొదలుపెట్టారు. 100 బొమ్మలను చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్న వృద్ధురాలు రెండు నెలల కాలంలో 73 బొమ్మలను తయారు చేశారు. మిగతా వాటిని పూర్తి చేసి అన్నింటిని కలిపి ఒకేసారి ఆమె చిన్నారులకు అందజేయనున్నారు. 

ఎంతో అందంగా పిల్లలకు నచ్చేలా బొమ్మలను తయారు చేసిన వృద్ధురాలి గురించి తెలుసుకున్న స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ఆమెను కలిశారు. ఆమె రూపొందించిన బొమ్మలను వాటితో ఉన్న వృద్ధురాలిని ఫొటోలు తీసి ఆమె మంచి మనసు గురించి వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో నెటిజన్లు ఆ వృద్ధ కళాకారిణిని మెచ్చుకుంటున్నారు. బొమ్మలతో ఉన్న కళాకారిణి ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు