ఆర్మూర్‌లో రైతుల మహాధర్నా

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో రైతులు మహాధర్నా నిర్వహించారు. సన్నరకం ధాన్యానికి రూ. 2,500, పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్‌లోని మామిడిపల్లి చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈ ధర్నాకు తరలివచ్చారు. సన్నాలకు..

Updated : 04 Nov 2020 15:09 IST

ఆర్మూర్‌: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో రైతులు మహాధర్నా నిర్వహించారు. సన్నరకం ధాన్యానికి రూ. 2,500, పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్‌లోని మామిడిపల్లి చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈ ధర్నాకు తరలివచ్చారు. సన్నాలకు మద్ధతు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. మద్దతు ధర కల్పించే విషయంలో గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సన్న రకం వరి పంటను సాగు చేయమని ప్రభుత్వమే సూచించిందన్నారు. పంటకు తెగుళ్లు రావడంతో సరైన దిగుబడి రాలేదని.. ఇలాంటి తరుణంలో మద్దతు ధరతో పాటు బోనస్‌ కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పసుపుకు మద్దతు ధర కల్పించే విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని