
కంటతడిపెట్టిస్తున్న బాలుడి దీన గాథ
వైరల్‌గా మారిన కుక్కతో నిద్రిస్తున్న ఫొటో
ముజాఫర్‌నగర్: ఫుట్‌పాత్‌పై శునకంతోపాటు నిద్రిస్తున్న ఓ బాలుడి ఫొటో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో దర్శనమిచ్చిన ఈ ఫొటో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. తన తండ్రి జైలు పాలయ్యాడని, తల్లి విడిచిపెట్టి వెళ్లిపోయిందన్న తొమ్మిదేళ్ల అంకిత్ దీనగాథ హృదయాలను మెలిపెడుతోంది. గత కొద్ది రోజులుగా అంకిత్ ముజఫర్‌నగర్‌లోని ఫుట్‌పాత్‌పైనే జీవిస్తున్నాడు. అతని వెంటే పెంపుడు శునకం డానీ కూడా ఉంది. బాలుడు కొద్ది రోజులపాటు టీ దుకాణంలో పనిచేసి, అనంతరం గాలి బుడగలను విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
ఫుట్‌పాత్‌పై ఓ బ్లాంకెట్ కప్పుకొని బాలుడు సహా కుక్క నిద్రిస్తున్న ఓ ఫొటో సామాజిక మాధ్యమాలను ఊపేసింది. ‘నీడ్ హోమ్ ఫర్ అంకిత్’ (అంకిత్‌కు నివాసం కావాలి) అనే హాష్‌ట్యాగ్‌తో ఫొటో వైరలయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బాలుడి కోసం గాలింపు చేపట్టి అతడి ఆచూకీ కనుగొన్నారు. ప్రస్తుతం అంకిత్ జిల్లా పోలీసు అధికారుల సమక్షంలో ఉన్నాడు. పోలీసులు ప్రస్తుతం బాలుడి సంబంధీకులను కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకోసం అతడి ఫొటోలను పలు పోలీసుస్టేషన్లకు పంపించినట్లు ఎస్ఎస్పీ అభిషేక్ యాదవ్ పేర్కొన్నారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖను కూడా అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
ఇవీ చదవండి...
నన్ను ఏడిపించేశారు: ఆనంద్ మహీంద్రా
తల్లిదండ్రుల కోసం బాసర వచ్చిన గీత
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.