రెండు నెలల్లో కరోనా టీకాలు వేయొచ్చేమో

అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 70 లక్షలకు చేరింది. రెండు లక్షలకు పైగా ప్రజలు ఈ వైరస్ ధాటికి బలయ్యారు. ఈ నేపథ్యంలో అమెరికాలో నవంబరు లేదా డిసెంబరు నాటికి టీకా వేసే ప్రక్రియ

Updated : 27 Sep 2020 05:33 IST

      యూఎస్‌ అంటువ్యాధుల నిపుణుడు ఫౌచీ 

 వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 70 లక్షలకు చేరింది. రెండు లక్షలకు పైగా ప్రజలు ఈ వైరస్ ధాటికి బలయ్యారు. ఈ నేపథ్యంలో అమెరికాలో నవంబరు లేదా డిసెంబరు నాటికి టీకా వేసే ప్రక్రియ ప్రారంభం అవుతుందేమో అని యూఎస్ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ అన్నారు. స్థానిక ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి రాజకీయాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయన్న ఆయన  వచ్చే ఏప్రిల్‌ నాటికి రకరకాల కంపెనీలకు చెందిన 700 మిలియన్ల వ్యాక్సిన్‌ డోస్‌లు యూఎస్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. అయితే వాటి సామర్థ్యంపై అనుమానం వ్యక్తం చేశారు. పరిమిత సమయానికి ఎక్కువ మందికి టీకాలు వేయటం ద్వారా వైరస్‌ను ధాటిగా ఎదుర్కోవటంలో మనం ప్రభావం చూపినట్లు అవుతుందని ఆయన వివరించారు. 
 దీంతో మనం కరోనా ముందు ఉన్నటువంటి సాధారణ పరిస్థితుల వైపు ఆలోచించవచ్చని ఫౌచీ తెలిపారు. తొలుత టీకా వేయించుకున్న వారు ఎలా ఉన్నారో తెలుసుకున్న తర్వాతే చాలా మంది ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకోడానికి ముందుకొస్తారని ఆయన వివరించారు. అమెరికా వ్యాప్తంగా ఆగస్టు 31 నాటికి 6 మిలియన్లుగా ఉన్న బాధితులు 25 రోజుల్లోనే 7 మిలియన్లకు చేరారు. 8లక్షల కరోనా కేసులు దాటిన రాష్ర్టంగా కాలిఫోర్నియా తొలిస్థానంలో ఉండగా 7 లక్షల పై చిలుకు కేసులతో టెక్సాస్‌ రెండో స్థానంలో ఉన్నట్లు ఆయన వివరించారు. దీంతో గత వారం  కంటే ప్రస్తుతం 9 శాతం కేసులు పెరిగినట్లు ఆయన వివరించారు. ప్రస్తుత శీతాకాల పరిస్థితుల్లో వైరస్‌ ఉద్ధృతిని కట్టడి చేయటం కష్టమని ఫౌచీ పేర్కొన్నారు. 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని