దసరాకు మరో 10 ప్రత్యేక రైళ్లు

దసరా పండుగ సమీపిస్తున్న వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే మరో 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాకినాడ - లింగంపల్లి; తిరుపతి -లింగంపల్లి; నర్సాపూర్‌ - లింగంపల్లితో ...........

Updated : 15 Oct 2020 05:18 IST

సికింద్రాబాద్‌: దసరా పండుగ సమీపిస్తున్న వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే మరో 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాకినాడ - లింగంపల్లి; తిరుపతి -లింగంపల్లి; నర్సాపూర్‌ - లింగంపల్లితో పాటు విజయవాడ -హుబ్లీ, తిరుపతి - అమరావతి మార్గాల్లో ఈ రైలు సర్వీసులను నడపనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 20న నుంచి నవంబర్‌ 30 వరకు కాకినాడ - లింగంపల్లి, తిరుపతి - లింగంపల్లి మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతామని తెలిపింది. అలాగే, నర్సాపూర్‌ - లింగంపల్లి స్టేషన్ల మధ్య ఈ నెల 23 నుంచి నవంబర్‌ 30 తేదీల మధ్య రైలు సర్వీసులు నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

 విజయవాడ -హుబ్లీ; హుబ్లీ - విజయవాడ మధ్య ఈ నెల 21 నుంచి నవంబర్‌ 30 వరకు ప్రతి రోజూ రైలు సర్వీసులు నడపనున్నట్టు తెలిపారు. అలాగే, తిరుపతి నుంచి మహారాష్ట్రలోని అమరావతికి ఈ నెల 20 నుంచి నవంబర్‌ 28 వరకు ప్రతి మంగళ, శనివారాల్లో నడపనున్నారు. అలాగే, అమరావతి నుంచి తిరుపతికి ఈ నెల 22 నుంచి నవంబర్‌ 30 వరకు ప్రతి గురు, సోమవారాల్లో ఈ సర్వీసులు నడవనున్నాయి.

ఇదీ చదవండి..

పండుగ సీజన్‌: రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని