అమరావతిలో ఐదు విగ్రహాలు మాయం

రాజధాని అమరావతి పరిధిలో ఉన్న అంబేడ్కర్‌ స్మృతివనంలో విగ్రహాలు మాయం కావడం కలకలం రేపింది. ...

Updated : 05 Sep 2020 14:02 IST

అమరావతి: రాజధాని అమరావతి పరిధిలో ఉన్న అంబేడ్కర్‌ స్మృతివనంలో విగ్రహాలు మాయం కావడం కలకలం రేపింది. శాఖమూరులో గత ప్రభుత్వం ఆరు నమూనా విగ్రహాలను ఏర్పాటు చేయగా ఇప్పుడు ఐదు ప్రతిమలు మాయమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న దళిత ఐకాస నేతలు స్మృతివనం వద్ద ఆందోళనకు దిగారు. విగ్రహాలు అపహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో అంబేడ్కర్‌ స్మృతివనంలో విగ్రహాలు మాయం కావడంపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని