విద్యార్థుల మేధస్సుకు‘స్కెడు’యాప్‌ 

పాఠశాల విద్యార్థుల్లో దాగి ఉన్న సాంకేతికతను వెలికి తీసి, వారి శక్తి సామర్థ్యాలను ప్రోత్సహించడం కోసం కేరళలోని అంకుర సంస్థ జేపీఎన్‌ఎమ్‌ఈ ‘స్కెడు(ఎస్‌కేఈడీయూ)’యాప్‌ను ఆదివారం ప్రారంభించింది.  దీనిలో భాగంగా ‘ఎన్‌ఈపీ 2020, విద్యార్థుల్లో సాంకేతిక అభివృద్ధి’అనే అంశంతో ఆదివారం వెబినార్‌ నిర్వహించారు.

Published : 22 Nov 2020 23:46 IST


కొచి: పాఠశాల విద్యార్థుల్లో దాగి ఉన్న సాంకేతికతను వెలికి తీసి, వారి శక్తి సామర్థ్యాలను ప్రోత్సహించడం కోసం కేరళలోని అంకుర సంస్థ జేపీఎన్‌ఎమ్‌ఈ ‘స్కెడు(ఎస్‌కేఈడీయూ)’యాప్‌ను ఆదివారం ప్రారంభించింది.  దీనిలో భాగంగా ‘ఎన్‌ఈపీ 2020, విద్యార్థుల్లో సాంకేతిక అభివృద్ధి’అనే అంశంతో ఆదివారం వెబినార్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థుల ఆలోచనలు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఉండేలా  యాప్‌లో అనేక విషయాలు పొందుపరిచినట్లు నిర్వహకులు తెలిపారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల ప్రవర్తన, సాంకేతిక పరిజ్ఞానంపై వారి ఆసక్తిని అంచనా వేయడానికి ఈ యాప్‌ ఉపయోగపడుతుందని వివరించారు.  కృత్రిమ మేధస్సుతో రూపొందించిన ఈ యాప్‌ ద్వారా  విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉంటారని, దీని వల్ల సాంకేతికతపై అవగాహన ఏర్పడుతుందన్నారు. విద్యార్థుల్లో మంచి అలవాట్లు, చదువులో సంపూర్ణ వృద్దితో సృజనాత్మకతకు అవకాశం ఉంటుందని తెలిపారు. జేపీఎన్‌ఎమ్‌ఈ సంస్థ ఏడు సాంకేతిక విద్యా  అంకుర సంస్థల్లో ఒకటిగా నమోదయ్యింది.  రాష్ట్ర్రాభివృద్ధిలో ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు ఈ సంస్థ సేవలందిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని