హైదరాబాద్‌: 3 రోజులు బయటకు రావొద్దు

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో హైదరాబాద్‌ శివారు ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. నగరంలోని అనేక కాలనీలు జల దిగ్బంధం అయ్యాయి. దాదాపుగా 1500 కాలనీల్లో నడుము లోతు వరకు వరద నీరు చేరిందని తెలిసింది. వీధులు..

Updated : 14 Oct 2020 14:08 IST

జీహెచ్‌ఎంసీ అత్యవసర సేవల నంబర్లు ఇవే

(హయత్‌ నగర్‌ సుధీర్‌కుమార్‌ కాలనీలో పరిస్థితి)

హైదరాబాద్‌: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో హైదరాబాద్‌ శివారు ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. నగరంలోని అనేక కాలనీలు జల దిగ్బంధం అయ్యాయి. దాదాపుగా 1500 కాలనీల్లో నడుము లోతు వరకు వరద నీరు చేరిందని తెలిసింది. వీధులు, కాలనీల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కనీసం మూడు రోజులు నగరంలోని ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించారు.

అత్యవసర సేవల కోసం 040 - 21111111, జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ - 90001 13667, 97046 01866, జీహెచ్‌ఎంసీ పరిధిలో చెట్లు తొలగించే సిబ్బంది కోసం 63090 62583, జీహెచ్‌ఎంసీ విద్యుత్‌ శాఖ- 94408 13750, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సేవల కోసం 83330 68536, 040 2955 5500 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని