కమ్యూనిటీ హాళ్లలో వసతి: లోకేశ్‌ కుమార్‌

ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నందుకు హైదరాబాద్‌ నగర ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ సూచించారు. వర్షాలు, వరద నీటితో అనేక ప్రాంతాల్లో రహదారులపై చెట్లు పడిపోయాయని తెలిపారు. పలు లోతట్టు ప్రాంతాలు...

Published : 14 Oct 2020 10:01 IST

హైదరాబాద్‌: ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నందుకు హైదరాబాద్‌ నగర ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ సూచించారు. వర్షాలు, వరద నీటితో అనేక ప్రాంతాల్లో రహదారులపై చెట్లు పడిపోయాయని తెలిపారు. పలు లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, సహాయ బృందాలతో వరద సహాయక చర్యలు చేపట్టామని వివరించారు. మరో రెండు రోజులు నగరంలో వర్షాలు కురుస్తాయని ఆయన వెల్లడించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆయన సూచించారు. శిథిలావస్థకు చేరిన భవనాలు, కొండవాలు ప్రాంతాల ప్రజలు వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఆసరా లేనివారికి కమ్యూనిటీ హాళ్లలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేస్తామన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని