Gautam Sawang: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌!

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇటీవల వరకు డీజీపీగా కొనసాగిన ఆయన్ను బదిలీ చేసి జీఏడీలో

Updated : 17 Feb 2022 11:37 IST

అమరావతి: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది. రెండురోజుల క్రితం వరకు డీజీపీగా కొనసాగిన ఆయన్ను బదిలీ చేసి జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించిన ప్రభుత్వం.. తాజాగా ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించింది. కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ఉన్న ఉదయ్‌భాస్కర్‌ పదవీకాలం ఆరునెలల క్రితం పూర్తయింది. అప్పటి నుంచి  పదవి ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవలే డీజీపీ పోస్టు నుంచి బదిలీ చేసిన సవాంగ్‌ను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని