Andhra News: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్‌ సవాంగ్‌

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

Updated : 24 Feb 2022 16:48 IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. విజయవాడ బందరు రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలోని ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఛాంబర్‌లో పూజలు చేసి వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. గౌతమ్‌ సవాంగ్‌ను డీజీపీ బాధ్యతల నుంచి తప్పిస్తూ.. ఆ స్థానంలో నూతన డీజీపీగా కె.రాజేంద్రనాథ్‌రెడ్డిని ప్రభుత్వం ఇటీవల నియమించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని