driverless train: డ్రైవర్‌లేని రైలు!

రైలు కదలాలంటే డ్రైవర్‌కు గార్డు పచ్చజెండా ఊపుతాడు.. ఆ తర్వాత చోదకుడు హారన్‌ కొట్టి, బండిని నెమ్మదిగా ముందుకు నడుపుతాడు.

Published : 13 Oct 2021 11:11 IST

ఫ్రాంక్‌ఫర్ట్‌: రైలు కదలాలంటే డ్రైవర్‌కు గార్డు పచ్చజెండా ఊపుతాడు.. ఆ తర్వాత చోదకుడు హారన్‌ కొట్టి, బండిని నెమ్మదిగా ముందుకు నడుపుతాడు. ఆధునిక పరిజ్ఞానం ఇప్పుడు డ్రైవర్‌ పాత్రను ఆక్రమించేసింది. చోదకుడు అవసరంలేని పూర్తి ఆటోమేటెడ్‌ రైలును ప్రపంచంలోనే తొలిసారిగా జర్మనీలో ఆవిష్కరించారు. సంప్రదాయ రైళ్లతో పోలిస్తే ఇది సమయపాలనలో చాలా నిక్కచ్చిగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంధనాన్ని 30 శాతం మేర పొదుపు చేస్తుందని, 30 శాతం మేర ఎక్కువగా ప్రయాణికులను రవాణా చేయగలదని చెప్పారు. జర్మనీలోని రైల్వే సంస్థ డాయ్‌చు బాన్, సీమన్స్‌ సంస్థలు హాంబర్గ్‌ నగరంలో వీటిని ఆవిష్కరించాయి. డిసెంబరు నుంచి ఇది ప్రయాణికులకు అందుబాటులో వస్తుంది. కొన్ని నగరాల్లో డ్రైవర్‌రహిత మెట్రో రైళ్లు ఉన్నాయి. పూర్తిస్థాయి రైలును ఈ విధంగా తీర్చిదిద్దడం మాత్రం ఇదే మొదటిసారి. అయినా పర్యవేక్షణ కోసం ఒక డ్రైవర్‌ను రైలులో ఉంచుతామని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని