దేశ భవిష్యత్‌ తరగతిగదుల్లోనే తయారవుతోంది

దేశ, వ్యక్తుల భవిష్యత్‌ తరగతి గదుల్లోనే తయారవుతోందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు. దేశాన్ని నడిపించే నాయకులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులే జాతినిర్మాతలని కొనియాడారు.

Published : 05 Sep 2020 23:04 IST

గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌: దేశ, వ్యక్తుల భవిష్యత్‌ తరగతి గదుల్లోనే తయారవుతోందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు. దేశాన్ని నడిపించే నాయకులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులే జాతినిర్మాతలని కొనియాడారు. దేవుళ్ల లాంటి గురువుల వల్ల ఎంతోమంది గొప్ప నాయకులుగా ఎదిగారని అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తమిళిసై మాట్లాడుతూ..పేద విద్యార్థులు సైతం ఉపాధ్యాయుల మార్గనిర్దేశంలో అద్భుతాలు సృష్టించారన్నారు. ‘‘పౌష్టికాహారంతో కూడిన విద్య ఆరోగ్యకరమైన దేశాన్ని తీర్చిదిద్దుతోంది. దేశ విద్యావ్యవస్థను తీర్చిదిద్దే సత్తా నూతన విద్యావిధానానికి ఉంది. కొత్త విధానం దేశాన్ని సూపర్‌పవర్‌గా తీర్చిదిద్దగలదు’’ అని తమిళిసై తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని