చెస్‌ క్రీడాకారులకు బిశ్వభూషణ్‌ అభినందన

ఫిడె చెస్‌ ఒలింపియాడ్‌లో స్వర్ణం సాధించిన భారత క్రీడాకారులను ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అభినందించారు.

Updated : 31 Aug 2020 10:50 IST

అమరావతి: ఫిడె చెస్‌ ఒలింపియాడ్‌లో స్వర్ణం సాధించిన భారత క్రీడాకారులను ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అభినందించారు. పసిడి పతకం సాధించడం దేశానికికే గర్వకారణమన్నారు. క్రీడాకారులు విశ్వనాథన్‌ ఆనంద్‌, హంపి, హారిక, హరికృష్ణకు అభినందనలు తెలిపారు. చదరంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఫిడే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో రష్యాతో కలిసి భారత్‌ ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.93 ఏళ్ల చెస్‌ ఒలింపియాడ్ చరిత్రలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. భారత్‌ను విజేతగా నిలపడంలో కోనేరు హంపి కీలక పాత్ర పోషించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని