
వేలానికి 7801 వజ్రాల ఉంగరం
రిజర్వ్ ధర రూ.78,01,000గా నిర్ణయం
ముంబయి: 7801 వజ్రాలు పొదగబడి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన బ్రహ్మకమలం వజ్రాన్ని వేలానికి ఉంచనున్నారు. అత్యధిక వజ్రాలు పొదిగి గిన్నిస్ బుక్‌లోనూ చోటు సంపాదించుకున్న ఈ ఉంగరాన్ని నవంబర్ 13 నుంచి 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నారు. 2వ తేదీనుంచి వేలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. www.thedivine7801.com వెబ్‌సైట్‌లో నిర్వాహకులు ఈ వేలాన్ని నిర్వహించనున్నారు. ఉంగరం రిజర్వ్ ధరను రూ.78,01,000గా నిర్ణయించారు.
హైదరాబాద్‌కు చెందిన ‘ది డైమండ్ స్టోర్ బై చుందూబాయి’ నిర్వాహకులు చందూబాయి కుమారుడు కొట్టి శ్రీకాంత్ ఈ ఉంగరాన్ని రూపొందించారు. కమలం రేకులు విచ్చుకున్నట్లు ఉండే ఈ కళాఖండం తయారీకి 11 నెలల సమయం పట్టిందని శ్రీకాంత్ తెలిపారు. దానికి ‘ది డివైన్-7801 బ్రహ్మ వజ్ర కమలం’గా పేరు పెట్టారు.
‘నా కళను గుర్తించి నేను రూపొందించిన ఉంగరానికి గిన్నిస్ బుక్‌లో చోటు కల్పించిన అధికారులకు ధన్యవాదాలు. ఈ విజయాన్ని మీతో పంచుకుంటున్నందుకు గర్విస్తున్నాను. 7801 వజ్రాలతో రూపొందించిన ఉంగరాన్ని ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు నిర్ణయించాం. ఉంగరాన్ని విక్రయించగా వచ్చిన ఆదాయంలో 10 శాతాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి ఇవ్వనున్నట్లు తెలిపేందుకు సంతోషిస్తున్నా’ అని శ్రీకాంత్ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: వినూత్నంగా గుర్రంతో సాగు పనులు..
-
Ap-top-news News
Pinakini Express: పినాకినీ ఎక్స్‌ప్రెస్‌కు ‘పుట్టినరోజు’ వేడుకలు
-
Ap-top-news News
Andhra News: నా చొక్కా, ప్యాంట్ తీసేయించి మోకాళ్లపై కూర్చోమన్నారు.. సాంబశివరావు ఆవేదన
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
-
India News
Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!
-
Movies News
Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- పంత్ ఒక్కడు ఒకవైపు..
- Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!
- IND vs ENG: ఆదుకున్న పంత్, జడేజా.. తొలిరోజు ముగిసిన ఆట
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య
- Presidential Election: రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మూ గెలుపు ఖాయమే..! మమతా బెనర్జీ
- Chile: సాధారణ ఉద్యోగి ఖాతాలో కోటిన్నర జీతం.. రాజీనామా చేసి పరార్!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- నీడనిచ్చి.. జాడ కరవయ్యావు!
- Pakistan: అగ్ర దేశాలకు ‘డంపింగ్ యార్డు’గా మారిన పాకిస్థాన్!